గత ఎన్నికల్లో కేవలం ఐదు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యానని.. ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తానని.. జాంబాగ్ డివిజన్ తెరాస అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా ఏంజె మార్కెట్లోని పూసల బస్తీ, సుందర భవన్లలో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: ఆనంద్ - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తానని జాంబాగ్ డివిజన్ తెరాస అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. వరదసాయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: ఆనంద్
ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆనంద్‌కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తమ గెలుపునకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరదసాయం కింద రూ.10వేలు ఇవ్వడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
ఇవీచూడండి:'తెరాసకు ఓటేయండి... గ్రేటర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం'