తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యా ప్రమాణాలను పెంచాలి' - కలెక్టరేట్​

పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దిగజారిపోవడంపై తల్లుల సంఘం ఆందోళన చేపట్టింది. ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించటానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేసింది.

విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలి

By

Published : Feb 11, 2019, 9:10 PM IST

విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలి
విద్యా ప్రమాణాలు పెంచాలని... నాణ్యమైన విద్యను అందించాలని నాంపల్లిలోని కలెక్టరేట్ ముందు తల్లుల సంఘం, బాలల హక్కుల పరిరక్షణ వేదిక సంఘం నిరసనలు చేపట్టింది. విద్యాసామర్థ్యాలను ప్రభుత్వం పర్యవేక్షించాలని డిమాండ్ చేసింది.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సరైన విద్యను అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని తల్లుల సంఘం అధ్యక్షురాలు ప్రమీల ఆరోపించారు. పాఠశాలలపై ప్రతినెల ప్రభుత్వం సమీక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details