కేసీఆర్ మొండి వైఖరితో 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం చేయాలని కోరారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పిచ్చి పాలనకు యాభై వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. సమ్మెకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించకుండా చేసిన ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీ వివేక్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాలు మద్దతివ్వాలి: ఎంపీ అర్వింద్ - ఎంపీ అర్వింద్
ముఖ్యమంత్రి పిచ్చి పాలనకు యాభై వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.
![ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాలు మద్దతివ్వాలి: ఎంపీ అర్వింద్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4741007-426-4741007-1570974045810.jpg)
ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఎంపీ అర్వింద్
ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఎంపీ అర్వింద్
ఇవీచూడండి: అవ్వా...నీరు కావాలంటూ వచ్చాడు..దోచుకెళ్లాడు