తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపోరుకు రంగం సిద్ధం.. సంక్రాంతి తర్వాత పోలింగ్​..! - వార్డుల పునర్విభజన ప్రక్రియ

పురపోరుకు రంగం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కోసం ముందస్తు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వార్డుల పునర్విభజన ప్రక్రియ ఈ నెల 17న పూర్తి కానుంది. ఆ తర్వాత ఓటర్ల జాబితా తయారీ, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల నిర్వహణ కోసం ప్రకటన విడుదల కానుంది.

సంక్రాంతి తర్వాత పోలింగ్​..!
పురపోరుకు రంగం సిద్ధం

By

Published : Dec 4, 2019, 5:03 AM IST

Updated : Dec 4, 2019, 8:03 AM IST

పురపోరుకు రంగం సిద్ధం.. సంక్రాంతి తర్వాత పోలింగ్​..!

శీతాకాలంలో ఎన్నికల వేడి రాజుకోనుంది. పాలకమండళ్ల పదవీ కాలం ముగిసిన పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మళ్లీ ఊపందుకోనుంది. ముందస్తు ఎన్నికల ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మిగతా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వార్డుల పునర్విభజన ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది.

పక్షం రోజుల ప్రక్రియ

కోర్టు ఆదేశాలకు అనుగుణంగా షెడ్యూల్ ప్రకటిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు, ఆ వెంటనే ముసాయిదా జాబితాల ప్రకటన పూర్తైంది. 121 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లలో వార్డుల విభజనకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. ముసాయిదాపై వారం రోజులపాటు ఈ నెల 9 వరకు అభిప్రాయాలు, వినతులు స్వీకరిస్తారు. వాటి పరిష్కారానికి మరో వారం రోజులు ఈ నెల 16 వరకు గడువుంటుంది. డిసెంబర్​ 17న వార్డుల విభజనకు సంబందించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత విభజనకు అనుగుణంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతుంది. ఈ ప్రక్రియకు వారం నుంచి పది రోజుల సమయం పడుతుందని అంచనా.

కొత్తేడాదిలో ఎన్నికలు..

ఓటర్ జాబితాలు సిద్ధమయ్యాక పురపాలక శాఖ బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టి ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తై వివరాలు అందిన వెంటనే ఎన్నికల ప్రకటన జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఈ మొత్తం ప్రక్రియ ఈ నెల నాలుగో వారం వరకు పూర్తవుతుందని అంచనా. ఆ వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి కొత్త ఏడాదిలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత పోలింగ్ ఉండవచ్చని తెలుస్తోంది.

ఇవీ చూడండి: మున్సిపల్​ వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల

Last Updated : Dec 4, 2019, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details