తెలంగాణ

telangana

ETV Bharat / state

కీలక రాబడులపై ప్రభుత్వ దృష్టి.. రూ.30వేల కోట్ల సమీకరణే లక్ష్యం - Government focus on key revenues not proposed in the budget

రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై నీలినీడలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వెసులుబాటుకు అదనపు రాబడులపై సర్కారు దృష్టి సారించింది. పన్నులతో పాటు పన్నేతర రాబడిని పెంచుకునేందుకు ఆర్ధిక శాఖ కసరత్తు చేస్తోంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆదాయాన్ని పెంచుకునేలా... ఇప్పటికే మద్యం ధరలు, వాహనాలపై జీవత పన్ను పెంపు వంటి అంశాల అమలుకు శ్రీకారం చుట్టింది.

కీలక రాబడులపై ప్రభుత్వ దృష్టి.. రూ.30వేల కోట్ల సమీకరణే లక్ష్యం
కీలక రాబడులపై ప్రభుత్వ దృష్టి.. రూ.30వేల కోట్ల సమీకరణే లక్ష్యం

By

Published : Jun 1, 2022, 6:16 AM IST

అప్పులపై కేంద్రం కొత్త నిబంధనలు, ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక వెసులుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. బడ్జెట్‌లో ప్రతిపాదించకున్నా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని సుమారు రూ.30 వేల కోట్ల అదనపు రాబడి పొందడానికి ఆర్థికశాఖ కసరత్తు వేగవంతం చేసింది.

*వాహనాలపై జీవిత పన్ను పెంపు, మద్యం ధరల పెంపు ద్వారా ఇప్పటికే ఏటా అదనంగా రూ.4,000 కోట్ల నికర రాబడికి మార్గం సుగమం చేసుకుంది.

*రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా గత ఏడాదికంటే సుమారు రూ.4,000 కోట్ల రాబడిని పెంచుకునేందుకు బడ్జెట్‌కు ముందే భూముల మార్కెట్‌ విలువలను పెంచింది. అదనంగా రూ.19 వేలకోట్ల పన్నేతర రాబడిని పెంచుకునేలా ప్రభుత్వం ప్రతిపాదించింది. భూముల అమ్మకం ద్వారానే రూ.15,500 కోట్లను సమీకరించుకునేలా హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీల ద్వారా వేలం ప్రక్రియను కొనసాగిస్తోంది.గత ఆర్థిక సంవత్సరంలో కూడా భూములు అమ్మకం ద్వారా రూ.20 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రయత్నించినా కరోనా సహా వివిధ కారణాలతో సాధ్యంకాలేదు. ఈసారి హైదరాబాద్‌ చుట్టుపక్కలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో..ప్రధానంగా స్థిరాస్తి వ్యాపారం జోరుగా ఉన్న చోట్ల ప్రభుత్వ భూములను లేఅవుట్లుగా మార్చి విక్రయించే అంశాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

*మొండి బకాయిల వసూళ్లపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. వివాదాల కారణంగా నిలిచిపోయిన సొమ్ములను రాబట్టేందుకు ఇప్పటికే వాణిజ్య పన్నులశాఖ వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా రూ.3,000 కోట్ల రాబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఎక్సైజ్‌శాఖ ద్వారా రాబడిని పెంచుకునే ప్రతిపాదనలను బడ్జెట్‌లో చేయకున్నా ఏటా సుమారు రూ.3,000 కోట్ల నుంచి రూ.3,500 కోట్లను అదనంగా సమకూర్చుకునేలా మద్యం ధరలను పెంచింది.

*రవాణాశాఖ ద్వారా రాబడిని రూ.4,953 కోట్లుగా పేర్కొంది. ఇది గత ఏడాది బడ్జెట్‌ అంచనాలకంటే తక్కువగా ఉన్నా గత నెల వాహనాలపై జీవిత పన్నును పెంచింది. దీంతో అదనంగా రూ.1,000 కోట్ల రాబడిని అంచనా వేశారు. శాఖలో చాలా కాలంగా వాహనాలపై జీవితపన్నును సవరించకపోవడంతోనే ఈ ఏడాది అందుకు పూనుకున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదే విధానంలో కొన్నేళ్లుగా దృష్టిసారించని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని శాఖల్లో పెండింగ్‌ బకాయిల వసూళ్లపై పరిశీలన జరుగుతోందన్నారు.

ఇదీ చూడండి..

రుణాలపై తొలగని సందిగ్ధం.. 'జూన్​' గండం గట్టెక్కేదెలా..?

ABOUT THE AUTHOR

...view details