తెలంగాణ రాష్ట్ర 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్. నరసింహన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపాకు. ఇలాగే భవిష్యత్తులో కూడా ప్రజాశ్రేయస్సు కోసం కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందేలా చూడాలని సూచించారు. ప్రజల సంతోషమే సర్కారు విజయాలకి కొలబద్ధ అని అభివర్ణించారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రభుత్వానికి విజయం చేకూరాలని కోరుకుంటున్నట్లు వివరించారు. "సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి" అని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మరోమారు శుభాభివందనాలు అని గవర్నర్ నరసింహన్ తెలియజేశారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు - TRS
'రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి': ఈఎస్ఎల్. నరసింహన్, గవర్నర్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు