హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని గౌడ హాస్టల్లో గౌడ సంఘాల జేఏసీ ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ ఆవిర్భావ సదస్సులో 18 గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం దీర్ఘకాలిక సమస్యలపై చర్చించారు. విద్య, కులవృత్తి, రాజకీయ బలోపేతం కోసం ఈ జేఏసీని ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ పల్లె లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా గౌడులు ఎదుర్కొంటున్న సమస్యలను తెరాస ప్రభుత్వం వచ్చాక పరిష్కరించిందని... ఇంకా కొన్ని సమస్యలు మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు.
'మా సత్తా చూపడానికి డిసెంబర్లో గౌడ మహాసభ ఏర్పాటు చేస్తాం' - గౌడ జేఏసీ ఆవిర్భావ సదస్సు తాజా వార్త
గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐక్యంగా పరీక్షరించుకునేందుకే తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ ఆవిర్భవించిందని తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని గౌడ హాస్టల్లో ఏర్పాటు చేసిన సదస్సులో వారు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు చెట్టు నించి కింద పడిన గీత కార్మికులకు ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
'మా సత్తా చూపడానికి డిసెంబర్లో గౌడ మహాసభ ఏర్పాటు చేస్తాం'
హైబ్రిడ్ తాటి చెట్లను పెంచడంతో పాటు వాటిని సులువుగా ఎక్కేందుకు నూతన పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే తాటిచెట్టు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మరణించిన గీత కార్మికునికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సత్తాను చాటేందుకు డిసెంబర్లో లక్ష మందితో హైదరాబాద్‌లో మహాసభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించనున్నట్లు పల్లె లక్ష్మణ్ గౌడ్ స్పష్టం చేసారు.