అంబర్పేట్ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది.. అభ్యర్థులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గోల్నాక డివిజన్ తెరాస అభ్యర్థి దూసరి లావణ్య, శ్రీనివాస్ గౌడ్ పాదయాత్ర నిర్వహించారు. డివిజన్లో తెరాస అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని అభ్యర్థులు పేర్కొన్నారు.
చిన్న చిన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీ సిస్టం, తాగునీటి సమస్య, మైనార్టీలకు శ్మాశాన వాటిక వంటి సమస్యలు నెరవేరుస్తామని అన్నారు.