గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఇవాళ కూడా బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాందేవ్‌గూడ, గోల్కొండ కోట, మక్కాయి దర్వాజ, ఫతే దర్వాజ, బంజారా దర్వాజ తదితర ప్రాంతాల్లో వాహనాలను మళ్లించనున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు.
ఘనంగా గోల్కొండ అమ్మవారి బోనాలు - బోనాలు
గోల్కొండ అమ్మవారి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలను దారి మళ్లించనున్నారు.
ఘనంగా సాగుతోన్న గోల్కొండ అమ్మవారి బోనాలు