హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో నివాసముంటున్న ఓ బంగారు, వజ్రాభరణాల వ్యాపారి గత నెల మూడో వారంలో తన పుట్టినరోజు వేడుకను ఇంట్లోనే జరుపుకున్నారు. ఓ ప్రజాప్రతినిధితోపాటు నగరంలోని జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మొత్తం 150 మంది పాల్గొన్నారు. తర్వాత కొద్ది రోజులకు వ్యాపారి మృతి చెందాడు.
బంగారం వ్యాపారి పుట్టిన రోజుతో 20 మందికి కరోనా
కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ వేడుకలు చేసుకొవద్దంటే ఎవరూ వినడం లేదు. తాజాగా ఓ బంగారం వ్యాపారి తన పుట్టిన రోజు వేడుకలకు బంధుమిత్రులను ఆహ్వానించారు. అతనికి ఉన్న వైరస్ మరో 20 మందికి సోకింది.
పుట్టిన రోజుతో 20 మందికి కరోనా
అతను కరోనాతో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపినా వారు పుట్టిన రోజు వేడుక విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు వేడుక విషయం బయట పడింది. పుట్టిన రోజుకు హాజరైన 20 మందికి వైరస్ సోకింది. అధికారులు మిగతా వారి వివరాలు సేకరిస్తే కొందరైనా వైరస్ బారినుంచి కాపాడే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి: కంటోన్మెంట్‌లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి