Gold ATM designer Vinod : వినోద్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి. తండ్రి వ్యాపారరీత్యా కొన్నేళ్లు బెంగళూరులో ఉన్నారు. అక్కడే వేసవి సెలవుల్లో సరదాగా వెబ్ డెవలప్‌మెంట్ కోర్సులో చేరాడు. పదోతరగతి పూర్తయ్యేసరికి అందులో పట్టు సాధించాడు. అప్పటి నుంచే సొంతంగా వెబ్‌సైట్‌లు రూపొందిస్తూ పాకెట్‌మనీ సంపాదించేవాడు. అలా మొదలైన ప్రయాణాన్నే కెరియర్‌గా మార్చుకున్నాడు.
Telugu Young man designed Gold ATM : ఇంజినీరింగ్‌కి వచ్చేసరికి సొంత ప్రాజెక్టులతో పాటు స్నేహితులకు సలహాలు ఇచ్చే, అధ్యాపకులకు అకడమిక్ ప్రాజెక్టులు చేసిపెట్టే స్థాయికి ఎదిగాడు. ఎంబీఏ పూర్తయ్యాక ప్రముఖ టెలికాం కంపెనీలో భాగస్వామిగా చేరాడు. ఆపై విశాఖపట్నంలో జీవిత బీమా కంపెనీలో మూడున్నరేళ్లు పనిచేసి మార్కెటింగ్, సేల్స్ మెలకువలు నేర్చుకున్నాడు.
2017లో హైదరాబాద్‌కి వచ్చేశాడు వినోద్. ఓవైపు ఉద్యోగం చేస్తూనే తనకంటూ గుర్తింపు తెచ్చే ఆవిష్కరణలపై పని చేయడం మొదలు పెట్టాడు. మొదటిసారి బధిరులకు తేలిగ్గా సమాచారం అందించే ఒక కమ్యూనికేషన్ పరికరాన్ని రూపొందించాడు. దీనికి పేటెంట్ దక్కింది. ఈ క్రమంలోనే ఏడేళ్ల కిందట హైదరాబాద్‌లో ‘ఓపెన్ క్యూబ్స్’ అనే అంకుర సంస్థ ప్రారంభించాడు.
Gold ATM machine in Begumpet Hyderabad: కొత్త కంపెనీ కావడంతో మొదట్లో ప్రాజెక్టులు సంపాదించడంలో చాలా సవాళ్లే ఎదురయ్యాయి. అయినా మొదటి ఆవిష్కరణ భిన్నంగా ఉండాలనుకొని ‘ఎన్‌హెచ్ 7’ అనే అప్లికేషన్‌ని తయారు చేశాడు. ఇది ఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాలను పోలిన యాప్. ఫీచర్లు బాగుండటం, వాడటం తేలిక కావడంతో.. రెండు నెలల్లోనే 18 లక్షల మంది వినియోగించడం మొదలుపెట్టారు. దీని కోసం ఎంతో కష్టపడి రూ.2 కోట్ల నిధులు సమీకరించాడు. ఆ యాప్ విజయవంతం కావడంతో సింగపూర్‌లోనూ కార్యాలయం తెరిచాడు.