కార్తీక మాసంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి (gold price hike). ఈ ఏడాది ఆగష్టు నుంచి 48 పైచిలుకు మార్కును దాటినప్పటి నుంచి బంగారం ధరల్లో స్వల్పంగా పెరగుదల, తగ్గుదల నమోదు చేస్తూ 50 వేలలోపే ఊగిసిలాడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే తొమ్మిది నెలల గరిష్ఠ ధరను చేరుకుంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం (22 carat gold) 45 వేల 900 వద్ద, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (24 carat pure gold) 50 వేల 500 ధర పలుకుతోంది. సాధారణంగా డిసెంబర్, జనవరిలో ధరలు పెరుగుతుంటాయి. కానీ ఈ ఒరవడి నవంబర్ నుంచే మొదలైందని బంగారం దుకాణం నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, పండుగల కారణంగా డిమాండ్ బాగుందని, ఈ డిమాండ్ ధరల స్థిరీకరణకు దోహదం చేస్తుందని తెలిపారు.
ధరల పెరుగుదలకు కారణం ఏమిటంటే..
అనిశ్చితి పరిస్థితులు ఎప్పుడూ బంగారానికి డిమాండ్ (Demand for gold) పెంచేస్తాయి. అమెరికాలో మాంద్యం (Recession in America) పెరగటంతో పెట్టుబడిదారులు మందు జాగ్రత్తగా పసిడిని కొంటున్నారు. ఆ ప్రభావం బంగారం ధరలపై కనిపిస్తోంది. దాంతో పాటు స్పాట్ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బులియన్ వర్గాలు సైతం ప్యూచర్ కాంట్రాక్టుల్లో పసిడిలో పెట్టుబడులకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. న్యూయార్క్ కమోడిటీస్ మార్కెట్లో (New York Commodities Market) ఒక దశలో ఔన్స్ బంగారం (Ounces of gold) 18 వందల 60 డాలర్ల పైచిలుకు వద్ద ట్రేడ్ అవగా, వెండి 25 డాలర్ల వద్ద నమోదైంది.
ట్రేడ్ నిపుణులు ఏమంటున్నారంటే..