కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపు కొనసాగుతోంది. మేడిగడ్డ ఎగువన కన్నెపల్లి పంపుహౌస్‌లోని ఆరు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కణ్నుంచి అన్నారం జలాశయంలోకి ఇప్పటి వరకు 9.29 టీఎంసీల నీటిని తరలించారు. అన్నారం పంపుహౌస్‌లో శుక్రవారం మధ్యాహ్నం వరకు నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోశారు. నీటి మట్టం తగ్గడం వల్ల నాలుగో పంపును తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ పెరిగితే ఆ పంపు ద్వారా కూడా నీటిని తరలిస్తారు. ఇప్పటి వరకు అన్నారం పంపుహౌస్ ద్వారా సుందిళ్ల జలాశయంలోకి 1.76 టీఎంసీల నీటిని పంపించారు. అన్నారం బ్యారేజీ నుంచి సుందిళ్ల పంపుహౌస్ ఫోర్ బేలోకి నీటిని తరలిస్తున్నారు. ఫోర్ బేలో నీటి మట్టం ఆధారంగా సుందిళ్ల పంపుహౌస్ ద్వారా ఎల్లంపల్లికి నీటి తరలింపు ప్రారంభిస్తారు.
తరలుతున్న గోదావరి జలాలు.. నిండుతున్న జలాశయాలు - గోదావరి జలాలు
కాళేశ్వరంలో గోదావరి నుంచి నీటి తరలింపు కొనసాగుతోంది. కన్నెపల్లి పంపుహౌస్‌లోని ఆరు పంపుల ద్వారా మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటివరకు అన్నారం జలాశయంలోకి 9.29 టీఎంసీల నీటిని తరలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు