ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద అధికారులు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆనకట్ట వద్ద గంటగంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారెజ్ వద్ద నీటిమట్టం 13.9 అడుగులకు చేరింది. అధికారులు డెల్టా కాల్వలకు 7వేల 300 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 13 లక్షల 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు భద్రాచలం వద్ద గోదారమ్మ నీటిమట్టం 45.5 అడుగులకు చేరింది. అధికారులు రెండోవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు వరద ప్రవాహ స్థాయి పెరుగుతోంది. అధికారులు ధవళేశ్వరం వద్ద రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ