శాంతిస్తున్న ఉగ్ర గోదారి.. 51.5 అడుగులకు చేరిన నీటిమట్టం! - గోదావరి నీటి ఉద్ధృతి
20:51 August 18
శాంతిస్తున్న ఉగ్ర గోదారి.. 51.5 అడుగులకు చేరిన నీటిమట్టం!
గత మూడు రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి శాంతించింది. వరుస వర్షాలతో భద్రాచలం వద్ద వేగంగా పెరిగిన గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టింది. నిన్న సాయంత్రం ప్రమాదకరంగా పెరిగిన నీటి ఉద్ధృతి క్రమంగా తగ్గి 51.5 అడుగులకు చేరింది.
వరుస వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి నది శాంతించింది. గత మూడు రోజులుగా వేగంగా పెరిగిన గోదావరి నీటి ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం 6 గం.లకు 61.7 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టి రాత్రి 8 గం.లకు 51.5 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద 11 అడుగుల మేర గోదావరి నీటిమట్టం తగ్గింది. వేగంగా నీటి ఉద్ధృతి పెరగడం వల్ల మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఆ హెచ్చరికను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత గోదావరి నీటిమట్టం 51.5 అడుగుల వద్ద ఉంది. క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి :పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి