చెరువులు, నాలాల దురాక్రమణపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లండి: ఎన్జీటీ - undefined
14:29 October 29
చెరువులు, నాలాల దురాక్రమణపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లండి: ఎన్జీటీ
హైదరాబాద్‌లో చెరువులు, నాలాల దురాక్రమణపై విచారించేందుకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం నిరాకరించింది. భాగ్యనగరంలో చెరువులు, నాలాల ఆక్రమణ జరిగిందని.. ఇటీవలి వరదలకు ఇదే ప్రధాన కారణమంటూ... జర్నలిస్టు సిల్వేరి శ్రీశైలం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిర్లాస్కర్ కమిటీ ప్రతిపాదనలు అమలుకావట్లేదని పిటిషనర్ ఎన్జీటీకి తెలిపారు.
అయితే కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాలని తాము ప్రభుత్వానికి చెప్పలేమని ఎన్జీటీ తెలిపింది. తెలంగాణ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఎన్జీటీ సూచన మేరకు సిల్వేరి శ్రీశైలం పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
ఇదీ చదవండి:'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్