తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణకు మరో'సిరి'.. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచస్థాయి చిరుధాన్యాల కేంద్రం - వ్యవసాయ రంగంలో పరిశోధనలకు మరో సిరి

Global Millets Center of Excellence In Hyderabad : తెలంగాణ వ్యవసాయ రంగంలో పరిశోధనలకు మరో అంతర్జాతీయ వేదిక ఏర్పాటు కాబోతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచస్థాయి చిరుధాన్యాల కేంద్రం (గ్లోబల్‌ మిల్లెట్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న చిరుధాన్యాల పరిశోధన సంస్థను అంతర్జాతీయ సంస్థగా మారుస్తున్నట్లు ప్రకటించింన విషయం విధితమే. దీనికి సంబంధించి.. ఈనెల 24(రేపు)న ప్రధాని దీనిపై అధికారిన విధాన ప్రకటన చేయనున్నారు.

Research Agriculture Sector In Telangana
Research Agriculture Sector In Telangana

By

Published : Feb 23, 2023, 11:03 AM IST

Global Millets Center of Excellence In Hyderabad : రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో పరిశోధనలకు మరో అంతర్జాతీయ వేదిక ఏర్పాటు కాబోతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచస్థాయి చిరుధాన్యాల కేంద్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇక్రిశాట్‌ అంతర్జాతీయ కేంద్రంగా ఉండగా, ఇది రెండోదిగా కానుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న జాతీయ స్థాయి చిరుధాన్యాల పరిశోధన సంస్థను అంతర్జాతీయ సంస్థగా మారుస్తున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Global Millets Center of Excellence in telangana : ఈనెల 24న ప్రధాని(నరేంద్రమోదీ) దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ప్రపంచస్థాయి సంస్థ రూపకల్పనపై కేంద్ర వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తలు, నిపుణులతో కసరత్తు జరిపి, విధివిధానాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ 1958లో జొన్న పరిశోధన సంస్థ ఏర్పాటై, 2014లో జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థగా మారింది. ఐరాస 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సంస్థను ప్రపంచస్థాయికి పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పరిశోధనలు, సాంకేతికతలు, అంకురాల సాయంతో దేశీయంగా చిరుధాన్యాల ఉత్పత్తికి ఊతమివ్వడం, రైతులకు సలహాలు, శిక్షణ ద్వారా సాయం అందించడం, ప్రజల్లో చైతన్యం, మార్కెటింగ్‌, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా కొత్త కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ కేంద్రం అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయడంతోపాటు సమన్వయ బాధ్యతలనూ నిర్వర్తిస్తుంది. ఈ నెల 24న ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన ప్రకటన అనంతరం దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలవుతుంది.

ఉజ్వల భవిష్యత్తు ఖాయం:దేశంలో చిరుధాన్యాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇప్పటికే దేశం చిరుధాన్యాల ఉత్పత్తిలో నాయకత్వ స్థానంలో ఉందని జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త, న్యూట్రిహబ్ సీఈవో బీ దయాకర్​రావు తెలిపారు. కొత్త ప్రపంచస్థాయి కేంద్రం ఏర్పాటు ద్వారా దేశానికి మరింత ఖ్యాతి దక్కనుందన్నారు. తెలంగాణకు ఇది గొప్ప మేలు చేస్తుందని పేర్కొన్నారు.

ఇప్పటికే భారత్‌తో పాటు అన్ని దేశాలు దీని ప్రాధాన్యాన్ని గుర్తించాయని స్పష్టం చేశారు. దేశంలో ఏకైక జాతీయ-స్థాయి పరిశోధనా సంస్థగా తమ సంస్థ విస్తృత పరిశోధనలు చేపట్టిందన్నారు. 250 స్టార్టప్‌లను ఇంక్యుబేట్‌ చేస్తున్నామని చెప్పారు. కొత్త కేంద్రంతో తమ బాధ్యతలు మరింత పెరుగుతాయన్నారు. ఉత్పత్తి పెంచడం, పోషక విలువ పెంపుదల, కొత్త పంట అనంతర సాంకేతికతలను అభివృద్ధి, శుద్ధి పద్ధతులను ద్వారా అదనపు విలువను జోడించి, మార్కెటింగ్‌ విస్తరణకు ఉపకరిస్తుంది తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details