హైదరాబాద్ సరూర్నగర్ మండలం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువుని ప్లాస్టిక్ సంచిలో మూటకట్టి పడవేసిన ఘటన కాలనీవాసుల్ని కలచివేసింది. రక్తపు మరకలతో ఉన్న సంచిని స్థానికులు తెరచి చూడగా అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి చనిపోయిన తర్వాత మూటకట్టి పడేశారా? లేదంటే బతికుండగానే వదిలేశారా అన్నది తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ప్లాస్టిక్ సంచిలో ఆడశిశువు మృతదేహం - ప్లాస్టిక్ సంచి
హైదరాబాద్లో ఓ ఆడశిశువును ప్లాస్టిక్ సంచిలో మూటకట్టి పడవేశారు. స్థానికులు గమనించగా అప్పటికే చిన్నారి మరణించింది. పోలీసులకు సమాచారమందించారు.
ప్లాస్టిక్సంచిలో ఆడశిశువు మృతదేహం