గిరిజనులకు తెరాస ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని గిరిజన శక్తి డిమాండ్ చేసింది. తమ హక్కుల సాధన కోసం హైదరాబాద్‌లో గిరిజన శక్తి ప్రథమ మహాసభ నిర్వహించారు. జనాభా దామాషా ప్రకారం 10 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తామని ఆ సంస్థ అధ్యక్షుడు రాజేశ్ నాయక్ అన్నారు. తమ హక్కుల సాధనకై డిసెంబర్ మాసంలో దిల్లీలో గూడెం గుండె చప్పుడు....తండా తండ్లటా సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
'10 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తాం' - గిరిజనలు
గిరిజనులకు తెరాస ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజన జనాభా దామాషా ప్రకారం 10 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
reservation