బిన్ ఫ్రీ సిటీగా మార్చేందుకు బల్దియా చేస్తున్న ప్రయత్నాలు అన్ని వృథాగానే పోతున్నాయి. గోల్కొండలాంటి స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతంలోనూ వ్యర్థాల నిర్వహణ సరిగా లేదు. మోతీ దర్వాజ వద్ద చెత్త పేరుకుపోతోందంటూ స్థానికులు ఫిర్యాదు చేయడం ఏరివేసిన తర్వాత మళ్లీ అక్కడే పారేయడం నిత్యకృత్యమైంది.
వీధులన్నీ చెత్తమయం..
నిరంతరం చెత్తను తరలిస్తున్నామనేందుకు సంకేతంగా బిన్ ఫ్రీ పద్ధతిని అవలంబిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది సఫలీకృతం కావడం లేదు. ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయి స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హరినగర్‌లో గార్బేజ్ కలెక్టింగ్ పాయింట్లు లేకపోవడంతో ఆ పక్కనే ఉన్న ఎస్‌ఆర్‌కే నగర్, జమిస్తాన్‌పూర్‌లో ఎక్కడి పడితే అక్కడే చెత్తను డంప్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇంటి నుంచి చెత్త సేకరించే వ్యక్తులు కొద్ది రోజులుగా రావడం లేదని దీంతో ఇళ్లలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని అత్తాపూర్‌లోని నలందనగర్‌వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. డబీర్‌పురా డివిజన్‌లోని నూర్‌కాన్ బజార్‌లోనూ ఇదే తీరు.