హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ(GHMC) సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తమ బంధువులు, నాయకుల బంధువులకు వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
GHMC: పర్యవేక్షణలోపం.. ఇష్టారీతిన వ్యాక్సినేషన్ - జీహెచ్ఎంసీ తాజా వార్తలు
ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేయడానికి జీహెచ్ఎంసీ(GHMC)కి బాధ్యత అప్పగించింది. కాని జీహెచ్ఎంసీ సిబ్బంది వ్యాక్సినేషన్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
GHMC: పర్యవేక్షణలోపం.. ఇష్టారీతిన వ్యాక్సినేషన్
నియోజకవర్గంలో రోజుకు వెయ్యి మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది తమకు నచ్చిన వారికి, డబ్బులు ఇచ్చే వారికి ఆన్లైన్ నమోదు చేసి వ్యాక్సిన్ ఇస్తున్నారని చెబుతున్నారు. షాపుల వద్దకు వెళ్లి సూపర్ స్ప్రెడర్లను ఫొటోలు తీసి వారి వివరాలను ఆన్లైన్ చేయాల్సి ఉంది కాని అలా చేయడం లేదు.
ఇదీ చదవండి: CABINET: మూడోదశను ఎదుర్కోనేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు