హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి 8 వరకు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్నిపలువురు అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది తొలగిస్తున్నారు. ప్రధానంగా మృగశిర కార్తె రోజు ముషీరాబాద్ చేపల మార్కెట్కు పెద్ద ఎత్తున చేపలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్ పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని, మట్టి కుప్పలను తొలగించడంలో జీహెచ్ఎంసీ సిబ్బంది నిమగ్నమయ్యారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం
ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చురుకుగా కొనసాగిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని అధికారుల పర్యవేక్షణలో తొలగిస్తున్నారు.
అడిక్మెట్లోని రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తతోపాటు ఇటీవల కచ్చా మోరీల నుంచి వెలికి తీసిన మట్టిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్త కుప్పలతో పాటు ఇటీవల ఈదురుగాలుల వల్ల విరిగిన చెట్లు, మొక్కలను తొలగించడంలో నిమగ్నమయ్యారు. ఉప కమిషనర్ ఉమా ప్రకాష్, ఏఎమ్హెచ్వో హేమలత అనునిత్యం ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందిస్తూ మురికివాడలను సందర్శిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి:కరోనా సోకిన జర్నలిస్టులకు ఆర్థిక సాయం