తెలంగాణ

telangana

ETV Bharat / state

చెత్తను తొలగించేందుకు జీహెచ్​ఎంసీ స్పెషల్ సానిటైజేషన్ డ్రైవ్ - హైదరాబాద్​ వరదలు

హైదరాబాద్​లో చెత్తను తొలగించేందుకు జీహెచ్​ఎంసీ స్పెషల్ సానిటైజేషన్ డ్రైవ్ చేపట్టింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ యంత్రాంగం అలుపెరుగకుండా శ్రమిస్తున్నారని కమిషనర్ లోకేశ్​ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 8,293 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్లు పేర్కొన్నారు.

ghmc
ghmc

By

Published : Oct 21, 2020, 6:52 AM IST

హైదరాబాద్​ నగరంలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు జీహెచ్ఎంసీ యంత్రాంగం అలుపెరుగకుండా శ్రమిస్తున్నారని కమిషనర్ లోకేశ్​ కుమార్ తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా ఈనెల 18 నుంచి ఇవాళ్టి వరకు చేపట్టిన స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ ద్వారా 8,293 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్లు పేర్కొన్నారు. చెత్త కుప్పల‌ను తొల‌గించేందుకు అద‌నంగా 277 వాహనాలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

చార్మినార్ జోన్‌లో అత్యధికంగా 4,782 మెట్రిక్ ట‌న్నులు, ఖైర‌తాబాద్‌లో 1,029 మెట్రిక్ ట‌న్నులు, ఎల్బీన‌గ‌ర్​లో 768 మెట్రిక్ ట‌న్నులు, కూకట్‌ప‌ల్లిలో 732 మెట్రిక్ ట‌న్నులు, సికింద్రాబాద్‌లో 732 మెట్రిక్ ట‌న్నులు, శేరిలింగంప‌ల్లి జోన్‌లో 433 మెట్రిక్ ట‌న్నుల చెత్తను తొల‌గించి డంపింగ్‌యార్డ్‌కు పంపిన‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు.

ఇదీ చదవండి :ఆశలు ఆవిరి: చిరు వ్యాపారులపై వర్షం దెబ్బ.. లక్షల్లో నష్టం

ABOUT THE AUTHOR

...view details