వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మాసబ్ ట్యాంక్ విజయనగర్ కాలనీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు.
'హైదరాబాద్‌లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు'
అగ్నికి ఆజ్యం పోసినట్లు కరోనా సమయంలో వర్షాలు వచ్చి నగరాన్ని అతలాకుతులం చేశాయని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టామని వెల్లడించారు.
'హైదరాబాద్‌లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు'
నగరవ్యాప్తంగా గత 15రోజుల్లో లక్ష టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించినట్లు చెప్పారు. ఇంకా 30వేల టన్నుల చెత్తను తొలగించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అంటువ్యాధుల సీజన్ అయినందున జీహెచ్‌ఎంసీ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుందన్నారు.
ఇదీ చూడండి:'సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్'