తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2019, 11:22 PM IST

ETV Bharat / state

'హైదరాబాద్​ను చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతాం'

హైదరాబాద్ రోడ్లపై చెత్తను సమూలంగా నిర్మూలించేందుకు జీహెచ్​ఎంసీ స్పెషల్ డ్రైవ్​ను చేపట్టింది. ఇళ్లలో పనికిరాని వస్తువులను సేకరణ కార్యక్రమాన్ని సోమాజిగూడలో మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు.

చెత్తలేని నగరంగా హైదరాబాద్

ప‌నికిరాని వ‌స్తువుల సేక‌ర‌ణ‌ కోసం... జీహెచ్​ఎంసీ చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నిరుప‌యోగంగా ఉన్న వ‌స్తువుల‌ను ఇంటి వ‌ద్ద నుంచే సేక‌రిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సోమాజిగూడ‌లో... నగర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప‌రిశీలించారు. ఈ నెల 12 వరకు చేపట్టనున్నారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ విధానం ద్వారా ఇప్పటి వ‌ర‌కు 42 మెట్రిక్ ట‌న్నులకుపైగా వ్యర్థప‌దార్థాల‌ు సేక‌రించారు. ఇళ్లలో ప‌నికిరాని వ‌స్తువులను బ‌హిరంగ ప్రదేశాల్లో వేయ‌కుండా జీహెచ్​ఎంసీకి అంద‌జేయాల‌ని మేయర్ విజ్ఞప్తి చేశారు. ప‌నికిరాని వ‌స్తువుల‌న్నింటినీ ర‌హ‌దారుల‌కు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేయడం వల్ల... రోడ్లపై మురుగునీరు చేరుతోందన్నారు.

చెత్తలేని నగరంగా హైదరాబాద్

ABOUT THE AUTHOR

...view details