తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకలి తీర్చే 'యాప్' - app

'ఫీడ్ ద నీడ్' కార్యక్రమాన్నిజీహెచ్ఎంసీ విస్తృతం చేయనుంది. ఆహార వ్యర్థాలను నివారించి, పేదవారి కడుపు నింపేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది.

ghmc

By

Published : Feb 12, 2019, 4:16 AM IST

Updated : Feb 12, 2019, 11:00 AM IST

జీహెచ్ఎంసీ
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొబైల్ అప్లికేష‌న్ ద్వారా అన్నార్థుల ఆకలి తీర్చాల‌ని నిర్ణయించింది. స్వచ్ఛంద సంస్థల స‌హ‌కారంతో మిగిలిపోయిన ఆహారాన్ని సేక‌రించి అవ‌స‌ర‌మైన వారికి అందించనుంది. ఈనెల 14న ఈ కార్య‌క్రమాన్ని ప్రారంభించాల‌ని భావిస్తోంది.

ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వారికి భోజ‌నం అందించే 'ఫీడ్ ద నీడ్' కార్యక్రమాన్ని విస్తృతం చేయనున్నారు. న‌గ‌రంలోని హోట‌ల్ య‌జ‌మానుల‌తో బ‌ల్దియా కార్యాల‌యంలో స‌మావేశం నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 15శాతం ఆహార పదార్థాలు వ్యర్థమవుతున్నాయి. ఇంతటి భారీ స్థాయిలో ఆహారం వృథా కాకుండా ఆకలితో అలమటిస్తున్న వారికి అందించాలని "ఫీడ్ ద నీడ్" కార్యక్రమం చేపడుతున్నామని దానకిషోర్ తెలిపారు.
శిల్పారామం, జూబ్లీ చెక్ పోస్ట్ స‌ర్కిల్ వ‌ద్ద ఆహార ప‌దార్థాల‌ను నిల్వ ఉంచడానికి రిఫ్రిజిరేట‌ర్స్​ను ఏర్పాటు చేశామ‌న్నారు. ఆహారాన్ని త‌నిఖీ చేసిన త‌రువాత అందిస్తామ‌న్నారు. ఫ్రిజ్​లు లేకుండా అన్నార్థుల‌కు ఆహారం చేర్చడమే లక్ష్యమని క‌మిష‌న‌ర్ వెల్లడించారు.
Last Updated : Feb 12, 2019, 11:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details