ఆహారం వృథాను అరికడదాం..
అన్నం పరబ్రహ్మ స్వరూపం... ఎంతో మంది ఆకలి క్షుద్భాదను తీరుస్తోంది నగరంలోని జీహెచ్ఎంసీ.
ఆకలిని జయిద్దాం...ఆహారం వృథాను అరికడదాం
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బల్దియా, యాపిల్ హోమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 'ఫీడ్ ది నీడ్' పేరిట 'ఆకలిని జయిద్దాం.. ఆహారం వృథాను అరికడదాం' అనే కార్యక్రమాన్ని చేపట్టింది. హైటెక్ సిటీ శిల్పరామం ఎదుట ఫ్రిజ్‌ను ఏర్పాటు చేసింది. నగరంలో ఎవరైనా మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా ఇందులో పెడితే అవసరం ఉన్నవారు తీసుకుని తమ ఆకలి తీర్చుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ అంతా విస్తరించనున్నారు.