తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్టిక్ బంద్​పై జీహెచ్​ఎంసీ నజర్'... చెత్తలో 20 శాతానికిపైగా ప్లాస్టికే

రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం...అనేక అనర్థాలకు దారి తీస్తోంది. ప్లాస్టిక్ వాడకం ప్రపంచ వ్యాప్తంగా చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. నగరంలోని నాలాల్లో ప్లాస్టిక్ నిండిపోయి వరదనీటికి ఆటంకంగా మారి వరదలకు కారణం అవుతోంది.

ప్రజలందరూ సహకరిస్తేనే  ప్లాస్టిక్ బారి నుంచి గట్టెక్కుతాం : జీహెచ్​ఎంసీ

By

Published : Nov 2, 2019, 8:55 AM IST

హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జీహెచ్ఎంసీ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్లాస్టిక్ ఉత్పత్తి నుంచి వాడకం వరకు నియంత్రణ జరగాలని వక్తలు అభిప్రాయడ్డారు.
నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 20 శాతానికి పైగా ప్లాస్టిక్ ఉంటున్నట్లు బల్దియా అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో చాలా వరకు రీసైకిల్ చేయడానికి వీలు లేనటువంటి ప్లాస్టిక్ ఉంటుంది. ప్రధానంగా ఆహార పదార్థాలను, నిత్యవసరాలను తీసుకెళ్లేందుకు..ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగిస్తున్నారు. ఇది మళ్లీ రీసైకిల్ చేయడానికి వీలు లేకుండా ఉంటోంది. అలాంటి వాటిని నిషేధించడం శుభ పరిణామమని అంటున్నారు నిపుణులు. పర్యావరణానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్న ప్లాస్టిక్ నియంత్రణ కోసం... అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందంటున్నారు. రీసైక్లింగ్ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్లాస్టిక్​ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున ఉపాధి ...
ప్లాస్టిక్ ఇండస్ట్రీపై ప్రజలు పెద్ద సంఖ్యలో ఆధారపడి ఉన్నారని దానిని పూర్తిగా నిషేధించడం సరికాదని ప్లాస్టిక్ తయారీ, ఉత్పత్తి అసోషియేషన్ ప్రతినిధులు అంటున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల అవసరం ఎంతో సులువైన పనిగా ఉందని... అందువల్లే వాటి వినియోగం బాగా పెరిగిందంటున్నారు. గతంతో పోలిస్తే మరింత ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగం పెరిగిన నేపథ్యంలో రీసైక్లింగ్ చేయడమే పరిష్కారమార్గం అంటున్నారు ప్రతినిధులు.
ప్లాస్టిక్​తో నాలాలు జామ్...ఆపై వరదముప్పు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్లాస్టిక్ అనేది చాలా సమస్యలకు కారణం అవుతున్నందున దానిని నియంత్రించడమే లక్ష్యంగా బల్దియా ముందుకు వెళ్తోంది. ప్లాస్టిక్​తో నాలాలు జామ్ కావడం వల్ల వరదముప్పు ఏర్పడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రజల్లో చైతన్యం కల్పించడం, కాదంటే జరిమాన కూడా వేస్తున్నామన్నారు జోనల్ కమిషనర్.
ప్రజలందరూ సహకరించినప్పుడే ప్లాస్టిక్ ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి వీలు అవుతుందంటున్నారు అధికారులు.

ప్రజలందరూ సహకరిస్తేనే ప్లాస్టిక్ బారి నుంచి గట్టెక్కుతాం : జీహెచ్​ఎంసీ

ABOUT THE AUTHOR

...view details