గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల కోసం నిధులు సమకూర్చుకునేందుకు బల్దియా ఏర్పాట్లు చేస్తోంది. బాండ్లరూపంలో నిధులు సేకరించేందుకు సిద్ధమైంది. గతేడాది బాంబే స్టాక్ ఎక్సేంజ్లిస్టింగ్లో నమోదైన అనంతరం నిర్వహించిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌లో జీహెచ్ఎంసీ బాండ్లకు అనూహ్య స్పందన వచ్చింది. ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయ మార్గాల స్థిరత్వంలాంటి కేటగిరీల్లో నమ్మకమైన పురపాలక సంస్థగా రేటింగ్ సాధించటం వల్ల బాండ్ల జారీ సులువైంది. గతేడాది రూ.395 కోట్లు బాండ్ల బిడ్డింగ్ ద్వారా సేకరించగా... ఈసారి రూ. 305 కోట్లు సాధించేందుకు బిడ్డింగ్‌కు వెళ్తోంది. అంతర్జాలంలో నిర్వహించనున్న బిడ్డింగ్ కోసం మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో సోమవారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. దశల వారీగా ఎస్సార్డీపీ పనుల కోసం వెయ్యి కోట్ల రూపాయలను బల్దియా బాండ్ల రూపంలో సేకరించనుంది.
నిధుల కోసం మరోసారి బిడ్డింగ్‌కు సిద్ధమైన బల్దియా
గ్రేటర్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు గాను అవసరమైన నిధుల కోసం మరోసారి బాండ్ల బిడ్డింగ్‌కు బల్దియా సిద్ధమైంది. గతేడాది రూ.395 కోట్లు బాండ్ల బిడ్డింగ్ ద్వారా సేకరించగా... ఈసారి రూ. 305 కోట్లు సాధించేందుకు బిడ్డింగ్‌కు వెళ్తోంది.
నిధుల కోసం మరోసారి బిడ్డింగ్‌కు సిద్ధమైన బల్దియా