తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్' - జీహెచ్​ఎంసీ మేయర్ వార్తలు

సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్ ప్రక్రియ చేపట్టినట్లు హైదరాబాద్​ నగర్​ మేయర్​ బొంతు రామ్మోహన్ తెలిపారు. చెరువుల్లో పేరుకున్న చెత్త, గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియను ప్రారంభించామని... దోమలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

ghmc-intensifies-relief-measures-in-hyderabad-under-mayor-bonthu-ram-mohan
'సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్'

By

Published : Nov 2, 2020, 1:33 PM IST

హైదరాబాద్‌లో ఇటీవల వరదలకు ఏర్పడిన బురద వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్ ప్రారంభించామని... మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జూబ్లీహిల్స్​లోని షేక్​పేట్ కొత్తచెరువులో పెరిగిన చెత్త, గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియను ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​తో కలిసి ప్రారంభించారు.

వీటితో పాటు దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్, డ్రోన్ స్ప్రేయింగ్ పనులను చేయిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. నగర వ్యాప్తంగా 39 చెరువుల్లో ఈ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. మూసీ నదిలో కూడా శానిటైజేషన్ డ్రైవ్ చేయనున్నట్లు తెలిపారు. కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నామన్నారు.

'సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్'

ఇదీ చూడండి:'వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక శానిటైజేషన్​ డ్రైవ్'

ABOUT THE AUTHOR

...view details