తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజారోగ్యమే లక్ష్యం.. ఇందిరా పార్కులో మరిన్ని హంగులు - GHMC has embarked on constructive initiatives to transform Indira Park

నగరానికి తలమానికంగా దాదాపు 35 ఎకరాల స్థలంలో ఉన్న ఇందిరా పార్కు వేలాది మంది వాకర్స్‌కు దోహదపడుతుంది. పార్కు మొత్తం ప్రకృతి వనంగా తీర్చిదిద్దడానికి జీహెచ్‌ఎంసీ దశలవారీగా నిర్మాణాత్మక ప్రాజెక్టులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో సర్వత్రా వాకర్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

ghmc-has-embarked-on-constructive-initiatives-to-transform-indira-park-into-a-healthcare-hub
ఇందిరా పార్కులో.. నిర్మాణాత్మక కార్యక్రమాలకు శ్రీకారం

By

Published : Jan 28, 2021, 11:03 AM IST

ఇందిరా పార్క్‌ని ఆరోగ్య పరిరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దడానికి జీహెచ్‌ఎంసీ నిర్మాణాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

దశలవారీగా..

35 ఎకరాల్లో ఉన్న ఇందిరా పార్కులో.. అనేక సమస్యలు ఉన్నాయని ఆయా సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ అనేకమార్లు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయా సమస్యలను జీహెచ్‌ఎంసీ దశలవారీగా పరిష్కరిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఒక ఓపెన్ మహిళా, పురుషుల జిమ్ ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా నగరంలోని డయాబెటిస్ తదితర రోగాలతో బాధపడే ప్రజలకు వ్యాయామం ద్వారా వారిని ఆరోగ్య పరిరక్షించుకునేందుకు దోహదపడుతోంది.

సిద్ధం చేసింది..

ఇటీవల ఒక ఎకరా స్థలంలో పంచతంత్ర పార్కును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. దాదాపు వెయ్యి గజాల స్థలంలో సీనియర్ సిటిజన్స్‌కు వ్యాయామం కోసం ఐదు లక్షల అంచనా వ్యయంతో అత్యాధునిక వ్యాయామ పరికరాలు కూడా సిద్ధం చేసింది. ఓపెన్ జిమ్ చుట్టూ పచ్చని చెట్లు చల్లటి వాతావరణం మధ్య ఉండడం వాకర్స్‌ను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇందిరాపార్కులోని రెండవ ఓపెన్ జిమ్ అతి త్వరలో సీనియర్ సిటిజన్లకు అందుబాటులోకి రానున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.

ఇదీ చదవండి: 'మీ ఆరోగ్య సూత్రాలు నచ్చాయ్‌.. పెళ్లి చేసుకుందామా?'

ABOUT THE AUTHOR

...view details