భవనాల్లో తనిఖీలు...
హైదరాబాద్ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ స్పష్టం చేశారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, అగ్నిప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమావేశం జరిగింది. వాణిజ్య, భారీ భవన యజమానులు అనుసరిస్తున్న అగ్నిప్రమాద నివారణ చర్యలపై తనిఖీలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.
బకాయిలుంటే చర్యలే..
2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలపై అపరాధ రుసుం మాఫీ ఉండదని జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. బకాయిలను వెంటనే చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ఆస్తిపన్ను వివాదాలను పరిష్కరించడానికి ఈ నెల 25, 26, 27 న, మార్చి 1, 2 న ప్రత్యేక అదాలత్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీగా బకాయిలు ఉన్న బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
త్వరలో 247 బస్తీ దవాఖానాలు..
నగరంలో నిరుపేదలకు వారి ఇంటి సమీపంలోనే వైద్య చికిత్సలు అందించేందుకు 35 బస్తీ దవాఖానాలు నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. మొత్తం 247 ఆసుపత్రుల ఏర్పాటులో భాగంగా.. 64 చోట్ల అనువైన ప్రభుత్వ భవనాలను పరిశీలిస్తున్నారు.
భవనాలపై గ్రేటర్ నిఘా..!
నగరంలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. వాణిజ్య, వ్యాపార, భారీ భవనాలపై నిఘా కట్టుదిట్టంతో పాటు... ఆస్తి పన్నులు కట్టి నగరాభివృద్ధిలో భాగం కావాలని సూచిస్తోంది.
నగరవాసుల భద్రతకు ప్రాధాన్యం
ఇదీ చదవండి:ఏటీఎం ముఠా అరెస్టు