తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ ఆర్థిక సాయం

ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.2 లక్షలు రూపాయల ఆర్థిక సహాయాన్ని జీహెచ్ఎంసీ అందజేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో బాధితులకు చెక్కును అందజేశారు.

GHMC financial assistance to the family of a worker who died in an accident
ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుడి కుటుంబానికి జీహెచ్ఎంసి ఆర్థిక సాయం

By

Published : Nov 4, 2020, 4:29 PM IST

బిహార్​కు చెందిన నిజామోద్దిన్.. హైదరాబాద్ బన్సీలాల్​పేట డివిజన్ పరిధిలోని పొట్టి శ్రీరాములు నగర్​లో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నాడు. పనుల్లో ఉండగా గతేడాది 13 డిసెంబర్​న నిజామోద్దిన్ ప్రమాదవశాత్తు మృతిచెందాడు.

పరిహారం కింద అతని కుటుంబ సభ్యులకు జీహెచ్ఎంసీ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సహాయం మంజూరయ్యింది. ఈ చెక్కును నిజామోద్దిన్ కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో అందజేశారు.

ఇవీ చదవండి: హైదరాబాద్​ కలెక్టరేట్​ ఎదుట విద్యా వాలంటీర్ల ధర్నా

ABOUT THE AUTHOR

...view details