హైదరాబాద్ రాష్ట్రఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈసీ పార్థసారథి సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇటీవల 30 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించారు. వారితో కమిషనర్, ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.
ఎన్నికల నిర్వహణపై ఇతర అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ఓటర్ల తుది జాబితాను జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు. ఇక ఏ సమయంలోనైనా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.