తెలంగాణ

telangana

ETV Bharat / state

కమిషనర్​ కారైతే చలానా చెల్లించరా..? - ghmc

సాధారణంగా రోడ్డుపై వాహనాలు వేగంగా  నడిపి చలాన్లకు గురికావడం... కొందరు జరిమానా చెల్లించకుండా ఉండడం చూశాం. కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్ కారు అతివేగంగా ప్రయాణించి... చలాన్లను కట్టకుండా తిరుగుతోందని ఓ పౌరుడు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తేరుకున్న అధికారులు పెండింగ్​ చలాన మొత్తాన్ని చెల్లించారు.

కమిషనర్​ కారైతే చలానా చెల్లించరా..?

By

Published : Jun 28, 2019, 6:31 AM IST

Updated : Jun 28, 2019, 1:24 PM IST

అతివేగంగా వెళ్లే వాహనాలను స్పీడ్​గన్​తో ట్రాక్ చేసి జరిమానాను చలాన్ల రూపంలో పంపించే విధానం భాగ్యనగరంలో కొనసాగుతుంది. ఒక్కసారి స్పీడ్​గన్​కు చిక్కారంటే సాధారణ వ్యక్తి అయినా.. ప్రభుత్వ అధికారైనా చలానా చెల్లించక తప్పదు. కాని జీహెచ్ఎంసీ కమీషనర్ కారు ఇప్పటి వరకు ఆరుసార్లు అధిక వేగంతో వెళ్లినట్లు పోలీసు రికార్డుల్లో ఉన్నప్పటికీ చలానా చెల్లించలేదని ఓ పౌరుడు ట్విట్టర్​ద్వారా పేర్కొన్నాడు. టీఎస్09 ఎఫ్​ఏ 4248 జీహెచ్ఎంసీ కమిషనర్ కారు నంబర్​పై రూ.6,210 చలాన్లు బాకీ ఉన్నట్లు తెలిపాడు. తేరుకున్న అధికారులు కారుపై ఉన్న చలానా మొత్తం చెల్లించారు. దీనికి కారణమైన కారు డ్రైవరును జీహెచ్​ఎంసీ కమిషనర్​ మందలించారు.

కమిషనర్​ కారైతే చలానా చెల్లించరా..?
Last Updated : Jun 28, 2019, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details