తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో వెబ్​కాస్టింగ్​కు దరఖాస్తుల ఆహ్వానం

త్వరలో జరగనున్న జీహెచ్​ఎంసీ ఎన్నికలకు వెబ్​ కాస్టింగ్​ చేయడానికి ఆసక్తి కనబరిచే అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడమేగాక.. తగు పారితోషికంం, సర్టిఫికేట్ జారీ చేస్తామని వెల్లడించారు.

GHMC commissioner lokesh kumar
జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో వెబ్​కాస్టింగ్​కు వాలంటీర్ల దరఖాస్తు

By

Published : Nov 16, 2020, 2:20 PM IST

జీహెచ్ఎంపీ ఎన్నికలకు వెబ్ కాస్టింగ్ చేయ‌డానికి ఇప్పటి వరకు 2 వేల మంది వాలంటీర్లు దరఖాస్తు చేసుకున్నారని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. ఈ వెబ్ కాస్టింగ్​కు మరింత మంది వాలంటీర్లు అవసరం ఉన్నందున ఇందులో పాల్గొన‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రిచే అభ్యర్థులు.. ముఖ్యంగా సీనియ‌ర్‌ ఇంజ‌నీరింగ్ విద్యార్థులు జీహెచ్ఎంసీలో త‌మ పేర్లు న‌మోదు చేసుకోవాల‌ని కోరారు. వెబ్ కాస్టింగ్​లో పాల్గొనే వాలంటీర్లు సొంత ల్యాప్ టాప్​ను కలిగి ఉండాలని చెప్పారు.

పోలింగ్, దాని ముందు రోజు ఈ వాలంటీర్ల సేవలు వినియోగించడం జరుగుతుందని పేర్కొన్నారు. వెబ్ కాస్టింగ్​లో పాల్గొనేవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడమేగాక త‌గు పారితోషికం, స‌ర్టిఫికెట్ జారీ చేస్తామని లోకేశ్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు myghmc యాప్ ద్వారా కానీ, https://bit.ly/GHMCELECTIONS-2020 అనే వెబ్ సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details