తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్యం ప్రకారం సర్వేను పూర్తి చేయాలి: జీహెచ్​ఎంసీ కమిషనర్ - జీహెచ్​ఎంసీ వార్తలు

లక్ష్యం ప్రకారం సర్వేను పూర్తి చేయాలని జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులకు సూచించారు. ఆస్తుల ఆన్​లైన్​ సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ప్రజల నుంచి సర్వేకు మంచి స్పందన వస్తోందని లోకేష్ కుమార్ వెల్లడించారు.

ghmc-commissioner-lokesh-kumar-on-property-online-survey
లక్ష్యం ప్రకారం సర్వేను పూర్తి చేయాలి: జీహెచ్​ఎంసీ కమిషనర్

By

Published : Oct 12, 2020, 1:33 PM IST

హైదరాబాద్​లో జరుగుతున్న ఆస్తుల ఆన్​లైన్ సర్వేను జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శేరిలింగంపల్లి, కూకట్​పల్లి జోన్లలో పర్యటించి ఆస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. లక్ష్యం ప్రకారం ఆస్తుల ఆన్​లైన్ సర్వేను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే నిర్వహించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వే మరింత వేగంగా చేయాలని పేర్కొన్నారు. ఆస్తుల సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని కమిషనర్ వెల్లడించారు.

ఇదీ చూడండి:హైదరాబాద్‌లో అందుబాటులోకి మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లు..

ABOUT THE AUTHOR

...view details