తెలంగాణ

telangana

ETV Bharat / state

"అందమైన పార్కుగా మార్చండి"

జూబ్లీహిల్స్​లో నిరుపయోగంగా ఉన్న 32 ఎకరాల రాక్ గార్డెన్​ను... అందమైన పార్కుగా రూపొందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోనర్ అధికారులను ఆదేశించారు.

By

Published : Mar 1, 2019, 7:41 PM IST

"అందమైన పార్కుగా మార్చండి"

"అందమైన పార్కుగా మార్చండి"
హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న రాక్ గార్డెన్​ను అందమైన పార్కుగా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోనర్ అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుప‌త్రి వెనుక ఉన్న ద‌ర్గా స‌మీపంలోని 32 ఎక‌రాల రాక్ గార్డెన్‌ను హ‌రిత‌ శుక్రవారంలో భాగంగా దాన‌కిషోర్ సంద‌ర్శించారు.

పనులు ఎప్పుడు మొదలు పెడ్తారు?

జిల్లాలో ఎన్నిక‌ల ప్రవ‌ర్తనా నియ‌మావ‌ళి అమ‌లులో ఉన్నందున ఎన్నికల అనంతరం నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. ఈ పార్కు నిర్మాణానికి సంబంధించి ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాక్ గార్డెన్‌ను వినూత్నంగా నిర్మించి నగరంలోనే అంద‌మైన పార్కుగా రూపొందించాల‌ని దానకిషోర్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:భారత్​కు 'అభి'నందనం

ABOUT THE AUTHOR

...view details