తెలంగాణ

telangana

ETV Bharat / state

'భాగ్యనగర అభివృద్ధికి అన్ని శాఖలు సహకరించాలి'

కేంద్ర ప్రభుత్వం సేఫ్​ సిటీ ప్రాజెక్టు కింద హైదరాబాద్​ను ఎంపిక చేసిందని.. నగరాభివృద్ధి కోసం అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో ఏర్పాటు చేసిన సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ తెలిపారు.

Ghmc_Co_Ordination_Meeting at hyderabad
జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసుల సమన్వయ సమావేశం

By

Published : Feb 13, 2020, 4:41 PM IST

భాగ్యనగర పేరు ప్రతిష్టలు ఇనుమడింప చేసేందుకు అన్ని శాఖల మధ్య సహకారం అవసరమని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్​కుమార్ అన్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్​ యంత్రాంగం మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఆయన సమావేశం నిర్వహించారు. నగరంలో 365 రోజులు ఏదోక వేడుక, పండుగలు, ర్యాలీలు, సమ్మేళనాలు, సదస్సులు జరుగుతూనే ఉంటాయని... అదే సమయంలో పౌర సదుపాయాల పనులు చేస్తుంటామని లోకేశ్​ తెలిపారు. నగరంలో జరిగే కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు, ట్రాఫిక్ వ్యవస్థ పాత్ర కీలకమైందన్నారు. 2020లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

సేఫ్​ సిటీగా హైదరాబాద్..

హైదరాబాద్​ను కేంద్ర ప్రభుత్వం సేఫ్​ సిటీ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. కోటి మందికిపైగా జనాభా ఉన్న భాగ్యనగరాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు అధికారులందరూ సమష్టిగా కృషి చేద్దామని సూచించారు.

'భాగ్యనగర అభివృద్ధికి అన్ని శాఖలు సహకరించాలి'

ఇవీ చూడండి:ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details