భవన నిర్మాణ అనుమతుల రుసుం వాయిదా రూపంలో చెల్లించే పద్ధతిని జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. స్థిరాస్తిపై మహమ్మారి ప్రభావం తగ్గించేందుకు ప్రభుత్వం జులై 2020లో ఈ వాయిదాల పద్ధతికి అనుమతిచ్చింది. మార్చి 31, 2021 వరకు ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు అప్పట్లో సర్కారు ప్రకటించింది. ఈ వాయిదా పద్ధతి ద్వారా స్థిరాస్తి రంగం పుంజుకుందని... మొత్తంగా 2020-21లో భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 797.13 కోట్ల ఆదాయం వచ్చిందని జీహెచ్ఎంసీ పేర్కొంది.
భవన నిర్మాణ అనుమతుల కోసం వాయిదా పద్ధతి పొడిగింపు - telangana varthalu
భవన నిర్మాణ అనుమతుల కోసం రుసుంను వాయిదా రూపంలో చెల్లించే పద్ధతిని జీహెచ్ఎంసీ పొడిగించింది. జూన్ 30వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
భవన నిర్మాణ అనుమతుల కోసం వాయిదా పద్ధతి పొడిగింపు
మొత్తం 11538 భవన నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇందులో 67 ఆకాశహర్మ్యాలు ఉన్నాయని తెలిపింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 2020-21లో కరోనా మహమ్మారి వల్ల భవన నిర్మాణ అనుమతులు తగ్గిపోయాయని జీహెచ్ఎంసీ తెలిపింది. గత సంవత్సరం లాక్డౌన్, తదనంతరం కార్మికుల లభ్యత తగ్గిపోవటమే దీనికి కారణమని ప్రకటించింది.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా రేపు వ్యాక్సినేషన్ నిలిపివేత