శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో చివరి క్షణాల వరకు ప్రాణాలతో పోరాడి మృతి చెందిన ఏఈ మోహన్‌కుమార్ కుటుంబసభ్యులను ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పరామర్శించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సుచిత్ర భాగ్యలక్ష్మీ కాలనీలో నివాసముంటున్న వీరి కుటుంబసభ్యులను పరామర్శించి.. ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభాకర్‌రావు హామీ ఇచ్చారు.
'శ్రీశైలం మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం'
శ్రీశైలం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను సోమవారం జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పరామర్శించారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన విద్యుత్ ఉద్యోగులందరికీ అన్ని విధాలా అండగా ఉంటామని సీఎండీ ప్రభాకర్‌రావు భరోసానిచ్చారు.
'శ్రీశైలం ఘటనలో మరణించినా వారి కుటుంబాలకు అండగా ఉంటాం'
అనంతరం చంపాపేటలో ఉంటున్న డీఈ శ్రీనివాస గౌడ్, ఆజంపూర్లో ఉంటున్న ఉజ్మా ఫాతిమా, జీడిమెట్లలో ఉంటున్న ఏఈ మోహన్ కుమార్ కుటుంబ సభ్యులను ప్రభాకర్ రావు పరామర్శించారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన విద్యుత్ ఉద్యోగులందరికీ అన్ని విధాలా అండగా ఉంటామని సీఎండీ ప్రభాకర్‌రావు భరోసానిచ్చారు. శ్రీశైలం ప్రమాదం తనను ఎంతగానో క్షోభపెట్టిందని ఆయన బాధపడ్డారు.
ఇదీ చదవండి-భూమికి అత్యంత సమీపానికి వచ్చిన గ్రహశకలం
Last Updated : Aug 24, 2020, 9:32 PM IST