విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటాక రియాక్టర్ నుంచి బెంజిన్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గాజువాక ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న బాధితుణ్ని కేజీహెచ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతులు షిఫ్ట్ ఇంఛార్జీ నరేంద్ర, కెమిస్ట్ గౌరీశంకర్‌గా గుర్తించారు. నరేంద్రది గుంటూరు జిల్లా తెనాలి కాగా.. గౌరీశంకర్ విజయనగరానికి చెందినవారు.
విశాఖ పరవాడలోని ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్...ఇద్దరు మృతి - ap latest news
06:02 June 30
విశాఖ పరవాడలోని ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్...ఇద్దరు మృతి
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, సీపీ ఆర్కే మీనా ఫార్మా సంస్థను సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, భద్రతా లోపాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాలపై ఏమైనా ప్రభావం ఉందా అనేది పరిశీలిస్తున్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు
సాయినార్ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు విశాఖ సీపీ ఆర్కే మీనా తెలిపారు. బాయిలర్‌లో తెల్లవారుజామున లోపం తలెత్తి గ్యాస్ లీకైనట్లు వివరించారు. మృతుల్లో షిఫ్ట్ ఇన్‌ఛార్జి నరేంద్ర, కెమిస్ట్ గౌరీ శంకర్‌గా గుర్తించామని అన్నారు. బాధితులు సూర్యనారాయణ, చంద్రశేఖర్, జానకిరావు, ఆనంద్‌బాబులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదంపైనా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:59 చైనా యాప్‌లపై నిషేధం