తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నుంచి ప్రజలను రక్షించాలని గంగమ్మకు గంగపుత్రుల నీరాజనాలు - హుస్సేన్ సాగర్

హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని ఏడుగుళ్ల వద్ద నుంచి హుస్సేన్ సాగర్ వరకు గంగపుత్రులు ఘనంగా బోనాలు జరుపుకున్నారు. హైదరాబాద్ పరిధి​లో కరోనా వైరస్ విస్త్రృత వ్యాప్తి వల్ల బోనాలు పరిమిత సంఖ్యలోనే నిర్వహించారు.

కరోనా నుంచి ప్రజలను రక్షించాలని గంగమ్మకు గంగపుత్రుల నీరాజనాలు
కరోనా నుంచి ప్రజలను రక్షించాలని గంగమ్మకు గంగపుత్రుల నీరాజనాలు

By

Published : Aug 17, 2020, 1:34 AM IST

హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని ఏడుగుళ్ల వద్ద నుంచి హుస్సేన్ సాగర్ వరకు గంగపుత్రులు బోనాలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి​లో కరోనా వైరస్ విజృంభణ వల్ల పరిమిత సంఖ్యలోనే బోనాలు నిర్వహించారు. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ... గంగపుత్ర మహిళలు బోనాలను కొనసాగించారు. వేడుకలో భాగంగా గ్రామ దేవతలకు వొడి బియ్యం సమర్పించారు. అనంతరం పసుపు, కుంకుమతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. గంగమ్మ తల్లి ఊరేగింపులో భాగంగా హుస్సేన్ సాగర్​లో గంగ తెప్పను వదిలారు.

'గంగమ్మా... కరోనాను నిర్మూలించు'

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారిని పారద్రోలాలని... తమ కుల దైవం గంగాదేవిని ప్రార్థించినట్లు తెలంగాణ గంగపుత్ర మహిళా సభ ప్రెసిడెంట్​ అరుణ జ్యోతి బెస్త తెలిపారు. ప్రజలందరూ ఎలాంటి ఆపదలో పడకుండా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె వెల్లడించారు. మహిళలందరూ భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులు ధరించి, శానిటైజర్ ఉపయోగించి ఉత్సవం కొనసాగించినట్లు ఆమె వివరించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని... చెరువులు, వాగులు, నదులు, ప్రాజెక్టులు నిండాలని మహిళా సభ ప్రిన్సిపల్ అడ్వైజర్ కొప్పు పద్మ బెస్త పేర్కొన్నారు.

సంస్కృతి, సంప్రదాయం కోసమే...

గంగపుత్ర కుల సంస్కృతి , సంప్రదాయాలను కొనసాగించేందుకే బోనాలు నిర్వహించామని గంగపుత్ర నాయకురాలు రేణుక బెస్త స్పష్టం చేశారు. గంగపుత్ర బోనాలు నిర్వహించడం పట్ల ఖైరతాబాద్ గంగపుత్ర సంఘం అధ్యక్షురాలు చంద్రకళ బెస్త హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహిళా సభ కార్యదర్శి అనిత బెస్త , మహిళా సభ అధికార ప్రతినిధి నాగమణి బెస్త , సునీత బెస్త, పూస పల్లవి బెస్త తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ఎడతెరిపిలేని వర్షాలు... మేడారాన్ని చుట్టేసిన వరద నీరు

ABOUT THE AUTHOR

...view details