రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ముషీరాబాద్ చేపల లారీల పార్కింగ్ ఎన్నో సమస్యలకు నిలయంగా మారిపోయింది. లారీల నుంచి చేపలు దించుతుండగా కింద పడిన చేపల వేస్టేజీని పక్కనే ఉన్న చెత్త కుండీలో వేస్తున్నారు. దాని వల్ల తీవ్ర దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్, కాలుష్య నియంత్రణ బోర్డు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు వాపోయారు.
చేపల మార్కెట్‌కు వచ్చీ పోయే వాహనాల వల్ల పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో పార్కింగ్ మైదానంలో మందు బాబులు లారీల పక్కన కూర్చుని మద్యం సేవిస్తున్నారని, స్థానికులు కనిపిస్తే వీరంగం సృష్టిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా జనావాసంలో ఉన్న ఈ పార్కింగ్ మైదానాన్ని వేరే స్థలానికి తరలించాలని కోరుతున్నారు. ఆర్టీసీ బస్ భవన్ పక్కనే సుమారు 8 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని... అక్కడికి ఈ చేపల పార్కింగ్‌ను తరలించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫిష్ లారీ పార్కింగ్ వల్ల గంగపుత్ర కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు :
1. ఫిష్ లారీల నుంచి వచ్చే మురికి నీరు వల్ల దోమల బెడద.
2. రాత్రి పగలు తేడా లేకుండా వచ్చే వాహనాల మూలంగా వచ్చే శబ్దాలతో కాలనీ వాసులకు నిద్ర లేమీ, భద్రత కరవవుతోంది.