Ganesh shape on banyan tree: ఏపీ మంగళగిరిలోని పోలీస్ శాఖకు చెందిన కనైన్ శిక్షణ కేంద్రంలో.. కొంత కాలం కిందట ఇక్కడ గోడ మీద చిన్ని మర్రిచెట్టు మొలిచింది. శిక్షణ కేంద్రంలో పని చేసే.. ప్రకృతి ప్రేమికుడైన ఓ అధికారి.. దాన్ని పీకి పడేయకుండా.. భద్రంగా వేరొకచోట నాటారు. చెట్టు పెద్దదయ్యే సరికి.. కాండంపై ఏక దంత వినాయకుడి రూపం రావడం.. అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలీసు సిబ్బంది ఆ ఆకారానికి పూజలు చేయడం ప్రారంభించారు.
రోజువారీ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఈ మర్రిచెట్టు ఏకదంతుడికి తప్పనిసరిగా పూజలు చేయడం ఆ అకాడమీకి దినచర్యగా మారింది. చెట్టు పెరిగే కొద్దీ ఏకదంత వినాయకుడి రూపం మరింత స్పష్టంగా, ఆకర్షణగా మారుతూ వస్తోంది. ఆ రూపాన్ని అలంకరించి పూజలు చేస్తున్నారు. ఈ వృక్షాన్ని ఎంతో పవిత్రంగా భావించి.. ఆరాధిస్తున్నామని పోలీసు అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. మర్రిచెట్టుపై వెలసిన ఏకదంత వినాయకుడిని స్థానికులు కూడా భక్తిశ్రద్ధలతో కొలుస్తూ పూజలు చేస్తున్నారు.