హైదరాబాద్ నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. గణపతిని ప్రతిష్ఠించి మూడు రోజులు పూర్తైన సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై రకరకాల విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు. వినాయకులతో నగరంలో ప్రతి వీధి కొత్త శోభను సంతరించుకుంది. మరోవైపు ఇళ్లలో ప్రతిష్ఠించిన వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ఈ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ యుద్ధప్రాతిపాదికగా ఏర్పాటు చేసింది.
ట్యాంక్‌బండ్‌పై గణేశ్‌ల నిమజ్జనం ప్రారంభం..
నగరంలో వినాయక సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. గణపతిని ప్రతిష్ఠించి మూడు రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు.
ట్యాంక్‌బండ్‌పై గణేశ్‌ల నిమజ్జనం ప్రారంభం..