తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో కన్నుల పండువగా గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర.. - Hyderabad Ganesh Immersion news

Ganesh Immersion in Hyderabad: భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జన శోభయాత్ర కనుల పండువగా సాగుతోంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాధులు హుస్సేన్‌సాగర్‌ తీరానికి తరలివెళ్తున్నాయి. విభిన్నరూపాల్లోని లంబోదరుల శోభాయాత్రతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోస్తు ఏర్పాటు చేశారు.

భాగ్యనగరంలో కన్నుల పండువగా సాగుతున్న గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రలు..
భాగ్యనగరంలో కన్నుల పండువగా సాగుతున్న గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రలు..

By

Published : Sep 9, 2022, 8:08 PM IST

Updated : Sep 9, 2022, 10:07 PM IST

భాగ్యనగరంలో కన్నుల పండువగా గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర..

Ganesh Immersion in Hyderabad: భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జనం సందడే వేరు. ఈసారి అత్యంత వైభవంగా వినాయక నిమజ్జన మహోత్సవం జరుగుతోంది. హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌ సహా పలుచోట్ల గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా హుస్సేన్‌సాగర్‌ ప్రాంతం ప్రజలతో కిటకిటలాడుతోంది. నిమజ్జనాల కోసం రహదారులపై గణనాథులు బారులు తీరాయి. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జనం సందడే వేరు

గణేశ్‌ శోభాయాత్ర మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి. వినాయక నిమజ్జన శోభాయాత్ర.. సిటీ పరిధిలో దాదాపు 354 కిలోమీటర్ల మేర సాగుతోంది. ప్రధాన శోభాయాత్ర బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ తీరం వరకు 18 కిలోమీటర్ల మేర జరుగుతోంది. భక్తుల కోలాహలం మధ్య కనుల పండువగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. భక్తుల నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య గణనాథులు ముందుకు కదులుతున్నారు. నగరం నలుమూలల నుంచి వచ్చిన భక్తుల గణపతి నామస్మరణతో హుస్సేన్​సాగర్‌ పరిసరాలు మారుమోగుతున్నాయి.

భాగ్యనగరంలో కన్నుల పండువగా గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర..

ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 12 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర కొనసాగే ప్రధాన మార్గాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు 24 గంటల పాటు.. కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.

Last Updated : Sep 9, 2022, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details