హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా గణపతి బొప్పా మోరియా....జై బోలో గణేశ్ మహారాజ్కి జై అనే నినాదాలు దద్దరిళ్లుతున్నాయి. మహానగరంలో ప్రతిఏటా గణేశ్ నిమజ్జనం ఒక పండుగలా జరుగుతోంది. ఏ రోడ్డు చూసినా వినాయకుల శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేసుకుంటూ గణనాథులను గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా హుస్సేన్ సాగర్, సరూర్నగర్ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహానగరంలో దాదాపు ఇవాళ 40 వేల ప్రతిమలను నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ గణనాథునిని నిమజ్జనం చేయటం కోసం అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈ శోభాయాత్రలు దాదాపు రేపు తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి.
భాగ్యనగరంలో జోరుగా శోభాయాత్రలు... - ganesh
మహానగరంలో గణేశ్ శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. నగరం నలుమూల నుంచి గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అంత ఉత్సహంగా ఈ వేడుకలో పాల్గొంటున్నారు.
ganesh immersion