తెలంగాణ

telangana

ETV Bharat / state

గణనాథుడి నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు

నవరాత్రులు పూజలందుకుంటున్న గణనాథుడి నిమజ్జనానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు కొనసాగే శోభాయాత్ర మార్గాలను పోలీస్‌, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పరిశీలించారు. 12న జరిగే నిమజ్జన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ ఏడాది కూడా ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం త్వరితగతంగానే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు.

సీపీ, జీహెచ్​ఎంసీ కమిషనర్​

By

Published : Sep 7, 2019, 11:52 AM IST

గణనాథుడి నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు

వినాయక నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా నిర్వహించేందుకు అధికార యంత్రాగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12న నిమజ్జనోత్సవం రోజు... హైదరాబాద్‌ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలను ట్యాంక్‌బండ్‌కు తరలించనున్నారు.

కేంద్ర పారామిలటరీ

కేంద్ర పారామిలటరీతో పాటు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ భద్రత విధుల్లో నిమగ్నం కానున్నారు. దాదాసు 21 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది నిమజ్జన బందోబస్తులో పాల్గొంటారు. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు కొనసాగే శోభాయాత్ర మార్గం సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో 350కు పైగా సీసీ కెమారాలతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఊరేగింపులో డిజేలను పూర్తిగా నిషేధించామని హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ తెలిపారు.

36 క్రేన్లు...

ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ఎప్పటికప్పుడు వ్యర్థాలను శుభ్రం చేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నగరపాలక సంస్థ సిబ్బంది అధికారులు షిఫ్టుల వారీగా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో విధులు నిర్వహించనున్నారు. మొత్తం 36 క్రేన్లను వినాయకుల నిమజ్జనానికి అందుబాటులో ఉంచారు. వీటితో పాటు మొబైల్‌ క్రేన్లు కూడా ఉంటాయి.

రోడ్లకు మరమ్మత్తులు

కొన్ని చోట్ల రోడ్లకు మరమ్మత్తులు చేయల్సి ఉందని... వాటిని వేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు. నిమజ్జనోత్సవం, శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, ఇతర అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనోత్సవం కొనసాగే రోజున ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కొన్ని పై వంతెనలను మూసివేయనున్నారు. వాహనదారులు విధిగా ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించి.. వేడుక విజయవంతం చేయాలని చేశారు.

ఇవీ చూడండి: 'చంద్రయాన్​-2 ల్యాండర్​, రోవర్​పై ఆశలు గల్లంతు'

ABOUT THE AUTHOR

...view details