తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగపూర్‌లో వినాయక చవితి వేడుకలు - వినాయక చవితి వేడుకలు 2020

సింగపూర్‌కు చెందిన తెలంగాణ కల్చరర్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజ వేడుకను ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల సుమారు రెండువేల మంది తమ ఇంటి నుంచి వీక్షించినట్లు తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

సింగపూర్‌లో వినాయక చవితి వేడుకలు
సింగపూర్‌లో వినాయక చవితి వేడుకలు

By

Published : Aug 22, 2020, 6:33 PM IST

సింగపూర్‌కు చెందిన తెలంగాణ కల్చరర్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించిన ఈ పూజ కార్యక్రమంలో సుమారు 50మంది భక్తులు పాల్గొన్నారు.

పూజ వేడుకను ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల సుమారు రెండువేల మంది తమ ఇంటి నుంచి వీక్షించినట్లు తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచాన్ని కరోనా కోరల నుంచి కాపాడాలని వినాయకుడిని కోరినట్లు పేర్కొన్నారు.

ఈ పూజను ఇండియా నుంచి మహబూబ్‌నగర్‌కు చెందిన పురోహితులు ఇరువంటి శ్రవణ్‌ కుమార్ శర్మ, ఇరువంటి పవన్ కుమార్ శర్మ, శశాంక్ లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా గర్రేపల్లి కస్తూరి, నంగునూరి వెంకట రమణ, రోజారమణి బొడ్ల, నల్ల దీప, కల్వ లక్ష్మణ్ రాజు, గార్లపాటి మాధురి, నడికట్ల భాస్కర్ వ్యవహరించారు.

ఇదీ చదవండి:ఈగ ఫిక్షనల్‌.. ఎలుక ఒరిజినల్‌

ABOUT THE AUTHOR

...view details